నల్లనాగు ల్లాగు మబ్బులు ముంచుకొచ్చె వేళ
అంచుల్లొ చూద్దాం వెండి సూర్యుని దీప్తులు
అజ్ఞానం నెత్తి మీద కత్తి పెట్టిన కాలంలో
పదును పెడదాం వివేక ఖడ్గ అంచులు
అలజడి వాన ఆగక జోరుగా కురిసే కాళ రాత్రి
ఎదురు చూద్దాం ఉదయం తెచ్చే హరివిల్లు కోసం
అబద్ధంకు అందరూ కరచాలనం ఇచ్చే గడియ
నిబద్ధతతో చెలిమి చేద్దాం నివురు కప్పిన సత్యంతో
మార్పు గొంగళి పురుగులా పాకే వేళ
అద్దుదాము ఊహా జగత్తుకి సీతాకోక చిలుక రంగులు
ఎవరూ మన వైపు తొంగి చూడని ఏకాంత క్షణంలో
ముచ్చట్లు పెడదాం నిశ్శబ్ద నిశిలొ ప్రియ తారకలతో
దూరమే జీవన సారమైన దరి
స్మరిద్దాం ప్రాణికోటి గుణమైన ఐక్యజీవితం
చైతన్య హరిణాన్ని కొండ చిలువ హరించే సమయాన
యక్ష ప్రశ్నించాలి మానవ ప్రపంచ పాత రోత రీతులు
స్పృశించాలి దివ్య భవిష్య లోక సరిహద్దులు.
No comments:
Post a Comment