Tuesday, 25 August 2020

 జీవించడం గొప్ప కాదు 

మనిషిగా మానవత్వం తో జీవించడం 
అరి షడ్వర్గాన్ని జయించడం 
అసత్యాన్ని తోసిరాజనడం
అన్యాయాన్ని ఎదిరించడం గొప్ప
మరణం విషాదం కాదు
కేవలం మనుగడ
బంధాల విచ్ఛిన్నం 
విలువలు లుప్తమవడం  
రాజీపడి నీడగా మారడం 
జీవకణాలు మాత్రం బ్రతికి ఆత్మను కోల్పొవడం 
నిజమైన విషాదం

No comments:

Post a Comment