ఇలా అవుతుంది అని కలలో అనుకోలేదు
మనిషి అంటే ప్రమాద సూచిక
భయంతో అసాంఘిక జీవిక
మృత్యు భీతి మనకు ఎక్కువ
'తెలివి'లేని జంతువులకు తక్కువ
అందుకే అవి చేయవు
సామూహిక ఖననం
మృత్యుప్రీతి మనకు ఎక్కువ
అందుకే చేస్తాం ప్రపంచ కదనం
సామాజిక సామూహిక హననం
ఈ పుడమి పుట్టిముంచే 'తెలివి' మనది
జంతువులది
సహజ జననం, మరణం
సృష్టిలో అత్యంత అశాంతి , అసాంఘిక జీవి
చేస్తాడు అహరహం ప్రపంచ రణం
ధ్వంసించి పర్యావరణం
మారాలి ఈ పాతుకున్న దుర్గుణం
అదే సౌమ్య సామ్యవాదం
No comments:
Post a Comment