Thursday, November 4, 2010

చిరు కవితలు

బోడి గాడి తోట స్మశానం
బుడతలకు క్రికెట్ మైదానం
గుడిసెల్లో పుట్టి పెరిగి
పుర్రెల వికెట్లతో
ఎముకలబాట్లతో ఆడుతారు
సచిన్ తెన్డుల్కర్లా
సృజనాత్మకంగా.
***
ముంగాల్లు లేని ఆవుదూడ
కుప్పి గంతులువేయలేదు
నిలబడలేదు
తల్లి పాలు తాగలేదు
రైతు కన్నుల్లో వేదన
టెక్నాలజీ చేసేనా ఏమైనా ?

No comments:

Post a Comment