మానవ బంధాలు
గాలిలో ఆవిరి అయ్యాక
ఐక్యం కాలేని పనివాడికి కూడు కరువయ్యాక
రోగి అయిన తల్లి తప్ప
పసిపిల్లకు దిక్కు ల
లేనప్పుడు
పొయిన వాడికి శ్మశానంలో రవ్వంత చోటు దొరకనపుడు
ప్రతి వాడు పక్క వాడికి అంటరాని వాడైనప్పుడు
నీ పొరుగు వాడిని నీవు ద్వేషిస్తున్నపుడు
మంచి చెప్పిన ముసలమ్మ ను
ఆకతాయిలు చితక బాదినపుడు
నరుడు, వైద్య నారాయణ హరీ మన్నపుడు
నర్సు నైటింగేలు గొంతులో ముల్లు దిగినప్పుడు
స్వచ్ఛ సైనికుల మనసు చెదిరిన దరి
రాజకీయుల హంగామా
నీకు నువ్వే శత్రువుగా రాజ్యం నిన్ను మలిచిన తరుణాన
ఇదే నాగరికత అంటే నవ్వు వస్తుంది
సమాచార చౌర్యం ఏరులై
పౌరులే భీరువులై
తమ భయసాగర సుడిగుండాన
హరాకిరి చేసుకున్న ఎరాలో
ఇదే జనస్వామ్యమంటె చిరాకు వస్తుంది
మధ్య యుగాల నుంచి
నవీన యుగానికి
హేతువు సేతువు
సగంలోనే ఆగిపోయింది.
No comments:
Post a Comment