మీశక్తి ఎంతో తెలుసుకోకుండా పరమేశ్వరుడు, ఆదిశక్తి, పరాశక్తి, దివ్యశక్తి చేత
దీవించబడిన ఈపుణ్యభూమిఫై పలుమార్లు దండయాత్రలకు ఒడిగట్టారు
నిజమైన వీరత్వంలేని మీరు చిత్తుగా ఓడిపోయి ఆఫై స్వదేశంలో
రాజ్యతంత్రం, ప్రజాతంత్రం కోల్పోయి దేశ ప్రజల నమ్మకాన్నే పోగొట్టుకున్నారు
చివరికి బయటపడింది మీ లక్ష్యంలేని పోరు, విజయంలేని యుద్ధం
ఆఫ్ఘన్ లోని సోవియట్ ను తరిమికొట్టేందుకు అమెరికా కురిపించిన
ఆయుధాలను, దొంగరాసులను ఆఫ్ఘన్ లకు కాకుండా తిన్నంత మీరుతిని
మిగిలిన లెక్కలేని దొంగరాసులను ఏమిచేయాలో తెలియక
స్యశ్యామలమయిన మాదేశంఫై మతిలేని యుద్ధానికి దుర్వినియోగ పరిచారు, లెక్కలేనన్నివిధ్వంసపు చర్యలు, దొంగచాటుగా దేశంలో చొరబాట్లు,
పొరుగు దేశంలో కుట్రలు ఇవి మీ నిత్య కార్యక్రమాలు
మాదేశంలోని ఐక్యతను దెబ్బదీయటానికి మీదేశ ప్రజల క్షేమాన్నే వదిలేశారు మాదేశంలోని శాంతిని చెరచాలని మీదేశంలోని శాంతినే మరచారు
రేయింబవళ్ళు మీరు పన్నిన కుట్రలు, దొంగదాడులు, విధ్వంసక చర్యలు మీరాశించిన ఫలితాలను ఇవ్వలేకపోయాయి ఫైగా ప్రజల్లో అశాంతి,
అనిశ్చత, ఆకలిబాధలు, దేశంలో ఎవ్వరికీ రక్షణలేని వాతావరణం
ఇది మీదేశంలో ఇన్నేళ్ళుగా మీరుసాధించుకున్న ప్రగతి అదే దుస్థితి
రాజధర్మం, ప్రజాక్షేమం, దేశప్రజల ఆకాంక్షలను తెలుసుకుని దేశాన్ని పాలించే
పరిపాలనా జ్ఞానం మీకెన్నటికి కలుగునో! ఎందుకంటే,
మాదేశప్రజలతో స్నేహాన్ని కోరుకుంటున్నారు మీదేశప్రజలు
ఇంకా చెప్పాలంటే ఆఫ్ఘన్ కుడా మాదేశంతో స్నేహాన్ని కోరుకుంటుంది
ఈ నిజాన్ని మీరు తెలుసుకుని కూడా తెలియనట్లుగా నటిస్తూ,
ఎదుగుతున్న స్నేహాన్ని తుంచేస్తూ ఇంకెంతకాలం మోసం చేస్తారు మీదేశప్రజలను?
స్వతంత్రంపొంది, విడిపోయి, అభివృద్ది చెందని దేశం ఈప్రపంచంలో మీదొక్కటేనేమో!
---- గుమ్ నామ్ సింగ్
అనువాదం : నారాయణ్ రావు