Tuesday, 25 August 2020

 తప్పించుకోలేవు

ఆ క్రిమి నుంచి
ఈ వేయి పడగలు నాగు  నుంచి
రెండూ మాటు వేస్తాయి
దానిని కడగాలి
దీని కోరలు పీకాలి
అది నీవే
ఆలోచించాలి
శ్రమించాలి
దీనికి ఔట్సోర్సింగ్
కుదరదు
బాధ పడేవాడే
తన మనసు
తనువు
పని 
ముడివేసి
విసరాలి
పదునైన 
అస్త్రం 
పటేల్ మని
పేలుతుంది
గ్రేట్ డిక్టెటర్ 
ఆడుకుంటున్న
గాలి బుడగ!

 ఇది చివరి ఉపన్యాసం

ఎపుడూ వద్దు సన్యాసం 
లేవండి 
బద్దకపు బెంచీల నుంచి
చూడండి
వినండి
మాట్లాడండి
ఆలోచించండి
అన్యాయాన్ని చించండి
అధికారం 
అహంకారం
అణు యుధ్ధం 
అదృశ్య శక్తి 
అన్ని కూలిపోతాయి 
మీరు నిలబడితే
శత్రువు తో కలబడితే 
గుర్తు పెట్టుకోండి
మీరు పోరాడితే 
ఒక కొత్త లోకం
మీరు వూరుకుంటె
పాత లోకం బూచిలా భయపె డుతుంది 
చెరిపెయ్యండి బ్రహ్మ రాతల్ని 
వినండి వినిపించని రాగాల్ని
చూడండి స్వర్గాన్ని
కూల్ గా
దించండి పాత వ్యవస్థ 
గుండెల్లో శూలాన్ని

 ఇలా అవుతుంది అని కలలో  అనుకోలేదు

మనిషి అంటే ప్రమాద సూచిక
భయంతో  అసాంఘిక జీవిక 
మృత్యు భీతి మనకు ఎక్కువ
 'తెలివి'లేని జంతువులకు తక్కువ
అందుకే అవి చేయవు
సామూహిక ఖననం
మృత్యుప్రీతి మనకు ఎక్కువ
అందుకే చేస్తాం ప్రపంచ కదనం
సామాజిక  సామూహిక హననం 
ఈ పుడమి పుట్టిముంచే  'తెలివి' మనది
జంతువులది 
సహజ జననం, మరణం 
సృష్టిలో అత్యంత అశాంతి , అసాంఘిక జీవి
చేస్తాడు అహరహం ప్రపంచ రణం 
ధ్వంసించి  పర్యావరణం
మారాలి ఈ పాతుకున్న  దుర్గుణం
అదే సౌమ్య సామ్యవాదం

 గాలిలో

నీటిలో 
నేలపై
నుంచి అది వస్తుందా?
వాయు కాలుష్యం
తరువులు అడ్డగోలుగా నరికి
నీటిని మురికి చేసి
భూమిని రాక్షసుల్లా తవ్విన 
ఆ  సమయాన రాని 
వివేకం 
ఇప్పటికయినా రావాలి 
ఈ దిన దిన గండం గడిచి
నిత్య నూతన దినకర  
దర్శన భాగ్యం కలగాలి.

 అందరూ నిద్రలో ఉన్న వేళ

నేను మెలకువలొ
ఎదో సత్యం పట్టుకుందామని
దుష్టశక్తులును సృష్టించేది 
నిర్జించేది నీవే 
నీ పేరు దైవమా?
అధికారమా?
అచ్చులో ప్రతి పతాక శీర్షిక
నేను నమ్మటం మానేశాను
వారికి కావలసింది సంచలనం
నాకు కావలిసింది చలనం

 జీవించడం గొప్ప కాదు 

మనిషిగా మానవత్వం తో జీవించడం 
అరి షడ్వర్గాన్ని జయించడం 
అసత్యాన్ని తోసిరాజనడం
అన్యాయాన్ని ఎదిరించడం గొప్ప
మరణం విషాదం కాదు
కేవలం మనుగడ
బంధాల విచ్ఛిన్నం 
విలువలు లుప్తమవడం  
రాజీపడి నీడగా మారడం 
జీవకణాలు మాత్రం బ్రతికి ఆత్మను కోల్పొవడం 
నిజమైన విషాదం

 Darkness is  chasing darkness

Light is sneaking  splitting into darkness
 Clouds hovering over humans grumbling
Men  torturing  exploiting expelling the hapless women children and the old
Nature has opened its third eye
Civilization fumbled crumbled and incinerated
Man is neither  a Phoenix nor a tree to relive
His account self- tampered
He seeks clemency 
But the President of immortals 
Refuses to excuse 
Nature raises its axe
Rain cleans the blood- drenched axe!

 Fear not invisible foes

Leaving visible enemies
 Hunger oppression, 
Persecution pain 
Are claiming our hearts and minds
Imagining our end
ignoring our  road
Immersed in doubts
Groping in despair
We cannot cherish ideals 
Daring death 
Caring for life 
Despising disease 
Smiling our way 
Slaying disbelief 
Enhancing reason 
Take a step ahead 
Like a Leopard
Like a Leopard !