" మానవుడే మహనీయుడు"
అని పాడుకున్నాం ఒకనాడు
మారణహోమం సాగించి
అల్పజీవిగా మిగిలాడు ఈనాడు
ప్రగతి అన్నాడు
పచ్చని చెట్లు కొట్టాడు
అడవులను ఆరగించి
పొగగొట్టాలు నాటాడు
శాస్త్ర జ్ఞానమంటూ
అనువు పేల్చాడు
సాంకేతిక జ్ఞానమంటూ
మిధ్యనే నిజమన్నాడు
నక్షత్ర యుద్ధమంటూ
నక్షత్రకుడిలా మరి
ప్రపంచ అంతానికి అసలుపై
వడ్డీ ఇమ్మని విసిగించాడు
వీడు చెప్పిన ప్రగతి
జంతువులను
మనుష్యులను
ప్రకృతినే మార్చింది బానిసగా.
వీడు వాడే సెల్ ఫోన్స్
మట్టించాయి పిట్టలను.
రోదసినుంచి శబ్దాలు
వినపడుతున్నాయి శతాబ్దాలుగా
"వినాశకాలే
విపరీత బుద్ధి"
No comments:
Post a Comment