Tuesday, September 7, 2010

రెండు లైన్లు

మండే తార్రోడ్డుపై పాదచారికి
నీడనిచ్చి సేద తీర్చే తరువు కవిత్వం.
***
చీకటిలో దారితప్పిన బాటసారికి
కాంతిరేఖ కవిత్వం .
***
రోగం బారిన పడిన జీవికి
ఆరోగ్య గుళిక కవిత్వం.
***
అలసి సొలసి సొమ్మసిల్లిన మనిషికి
సత్తువనిచ్చే కొబ్బరి నీరు కవిత్వం.
***
నడిసంద్రంలో ఒంటరి జాలరికి
ఉసురు నిలిపే ఆశ కవిత్వం.
***

No comments:

Post a Comment