Tuesday, September 7, 2010

"లాల్ బహదూర్ శాస్త్రి కోసం" - రవీంద్రనాథ్ జంధ్యాల

మొగల్ సరాయిలో పుట్టిన మొగిలి పువ్వు

కష్టాల నదినీది నేర్చింది చదువు

తోటలో మామిడికాయలు చోరీ చేసిన పోరడు

మాలి మందలింపు కు పూర్తిగా మారాడు

కట్నంగా అడిగింది చరఖా, నూలు

దేశం కోసం ఇచ్చింది నవశిశిరాల జైలు

పదవి వద్దనెను పట్టాలు తప్పితే రైలు

"జై జవాను -జై కిసాను " నినాదం

పాకిస్తాన్ను తిప్పికొట్టి జాతి మదిలో మోదం

తాష్కెంట్లో ఇల రాలిన శాంతి సుమం

విరజిమ్మేను కీర్తిసుగంధం

No comments:

Post a Comment