Wednesday, October 20, 2010

రెండు లైన్లు

చావు గూర్చి యోచనే మనిషికి చెప్పును ఏం చేయాలో
అసత్యాలు తొలగిపోతాయి మదిలో
***
ఏకాంతం భరించలేక పిలిచాను కుక్కను
నాదు మాట వినక ఎక్కెను పక్కను.
***
డొనేషన్లు లాగి నిర్మిస్తారు నేషన్
అనుమతులనమ్మి చేస్తారు పరేషాన్
***
మనిషి మనీషిగా మారటం 'విశ్వంభర'
***
తెలుగు భాష మరిచారు మన పిల్లలు
ఇంగ్లీష్ భాషన్నా విరిచారు పెదవులు
***
ఒక్క వాక్యంలో సమస్త విశ్వం కవిత్వం
***
నిజాన్ని నిర్భయంగా చెప్పటం అరున్ధతీయం
***
ఘంటసాలను కాదని వంటశాల అంటే అదే వినిమయతత్వం

No comments:

Post a Comment