Wednesday, December 29, 2010

సత్యకాలపు సూర్యుడా
రాజా !
నిన్ను తలచుకుంటేనే
సత్యయుగంలోని పరిస్థితులు ఎలా ఉంటాయో తెలుస్తున్నది
విహారానికి ప్రశాంతమయిన మునికుటీరాలకు వెళ్ళిన నీవు
ముని దురహంకారానికి గురికావలసి వచ్చినది
ఆడిన మాట తప్పని న్యాయ-సత్య దూతవు నీవు
రాజకీయం తెలియని మహారాజువు నీవు,
ఒక్క శ్రీరాము తప్ప
రాజు లెల్లరు ఎన్నడు వెనుకాడలేదు రెండో వివాహానికి
నీచేత ఒక్క అబద్దం చెప్పించాలని ప్రయత్నించిన
విశ్వామిత్రుని అహంకార, కపటనీతికి లోబడకుండా
సత్య మార్గమున పయనిస్తూ నీరాజ్య సర్వస్వమును వదిలినావు
యజ్ఞానికి నీవిస్తానన్న ధనాన్ని రుణంగా మార్చాడు మునిమహారాజు
ముని ఋణం తీర్చేందుకు మీ రాజదంపతులు
బానిసలుగా అమ్ముడుపోయి దాసిగా, వీరదాసుడిగా మారారు
చనిపోయిన మీ కుమారునితో చివరకు స్మశానంలో కలిసారు
రాజాజ్ఞను నెరవేర్చేందుకు నీ సతీమణి చంద్రమతి శిరచ్చేదమునకు
వెనుకాడని నీవు!
నీ తత్వము మహాద్భుతం, నీ ధర్మము పుణ్యప్రదం
కలియుగంలోంచి చూస్తే సత్యయుగంలోని సూర్యునిలా కనిపిస్తున్నావు
నీ సత్యము ఈ కలియుగంలోని ప్రజలకు కలలా అనిపిస్తున్నది!
---డెక్కా నారాయణ రావు (094062 54194)

No comments:

Post a Comment