మానవ బంధాలు
గాలిలో ఆవిరి అయ్యాక
ఐక్యం కాలేని పనివాడికి కూడు కరువయ్యాక
రోగి అయిన తల్లి తప్ప
పసిపిల్లకు దిక్కు ల
లేనప్పుడు
పొయిన వాడికి శ్మశానంలో రవ్వంత చోటు దొరకనపుడు
ప్రతి వాడు పక్క వాడికి అంటరాని వాడైనప్పుడు
నీ పొరుగు వాడిని నీవు ద్వేషిస్తున్నపుడు
మంచి చెప్పిన ముసలమ్మ ను
ఆకతాయిలు చితక బాదినపుడు
నరుడు, వైద్య నారాయణ హరీ మన్నపుడు
నర్సు నైటింగేలు గొంతులో ముల్లు దిగినప్పుడు
స్వచ్ఛ సైనికుల మనసు చెదిరిన దరి
రాజకీయుల హంగామా
నీకు నువ్వే శత్రువుగా రాజ్యం నిన్ను మలిచిన తరుణాన
ఇదే నాగరికత అంటే నవ్వు వస్తుంది
సమాచార చౌర్యం ఏరులై
పౌరులే భీరువులై
తమ భయసాగర సుడిగుండాన
హరాకిరి చేసుకున్న ఎరాలో
ఇదే జనస్వామ్యమంటె చిరాకు వస్తుంది
మధ్య యుగాల నుంచి
నవీన యుగానికి
హేతువు సేతువు
సగంలోనే ఆగిపోయింది.
Saturday, April 25, 2020
కొత్తగా చావు భయం?
కూలీల కడగండ్లు
రైతుల ఆత్మహత్యలు
విద్యార్థుల (ఆత్మ) హత్య లు
ఆసుపత్రిలో పేద రోగుల బాధలు
అడవుల్లో అణగారిన స్వరాలు
రహదారి ప్రమాదాలు
నిన్ను కదిలించలేదు.
మధ్య ప్రాచ్య వివాదాలు
బాంబుల వానలు
నడి సంద్రాన ఉడిగిన ఉసుర్లు
నిన్ను కలవర పరచలేదు
మత పిచ్చి, ఉగ్రవాదం
జాతీయ దురహంకారం
సాదా, సాధు జనుల సంహారం
కుల పరువు హత్యలు
హేతువాదుల వధ
నిన్ను రగిలించలేదు
వ్యక్తి స్వాతంత్య్రం పై
రాజ్యాంగ స్పూర్తిపై,
కలం వీరులపై
అతివల, పసిపిల్లలపై
ముసలి వారిపై
మానవ బంధాలపై దాడి
నిన్ను ఖేద పెట్టలేదు.
ప్రకృతి వాదం తప్పని
వినిమయ వాదం ఒప్పని
మూగజీవుల వధపై
.కామ్ గా ఉండి పోయి
వీర పురుషుల పూజలో
బ.జా.సంస్థల భజనలో
నీవెప్పుడో
ఉదాశీనత శవ పేటికలో
దీర్ఘనిద్రలో ఉన్నావు
ఇప్పుడిక నీకు కొత్తగా చావు భయం ఎందుకు ?
రైతుల ఆత్మహత్యలు
విద్యార్థుల (ఆత్మ) హత్య లు
ఆసుపత్రిలో పేద రోగుల బాధలు
అడవుల్లో అణగారిన స్వరాలు
రహదారి ప్రమాదాలు
నిన్ను కదిలించలేదు.
మధ్య ప్రాచ్య వివాదాలు
బాంబుల వానలు
నడి సంద్రాన ఉడిగిన ఉసుర్లు
నిన్ను కలవర పరచలేదు
మత పిచ్చి, ఉగ్రవాదం
జాతీయ దురహంకారం
సాదా, సాధు జనుల సంహారం
కుల పరువు హత్యలు
హేతువాదుల వధ
నిన్ను రగిలించలేదు
వ్యక్తి స్వాతంత్య్రం పై
రాజ్యాంగ స్పూర్తిపై,
కలం వీరులపై
అతివల, పసిపిల్లలపై
ముసలి వారిపై
మానవ బంధాలపై దాడి
నిన్ను ఖేద పెట్టలేదు.
ప్రకృతి వాదం తప్పని
వినిమయ వాదం ఒప్పని
మూగజీవుల వధపై
.కామ్ గా ఉండి పోయి
వీర పురుషుల పూజలో
బ.జా.సంస్థల భజనలో
నీవెప్పుడో
ఉదాశీనత శవ పేటికలో
దీర్ఘనిద్రలో ఉన్నావు
ఇప్పుడిక నీకు కొత్తగా చావు భయం ఎందుకు ?
నువ్వు-నేను-ప్రకృతి
ప్రకృతి ఒడిలో నువ్వు
నీ కన్నుల్లో ఆమె నవ్వు
ఎప్పుడయింది ఆమె నీకు అరి
ఏ దవానలం, తుఫాను, మహమ్మారి
వేసింది మీ బంధానికి ఉరి!
నాడు కలిసి వేటాడావు
పశువులు మేపావు
వ్యవసాయం చేశావు
ఎప్పుడయింది ఆ సబల అబల?
ప్రాచీన యుగంలో సిలువవేసి
మధ్య యుగంలో అణిచివేసి
నవీన యుగంలో వేతన బానిసను చేసిన నీతో
వద్దు కరచాలనం.
పన్నులు లాగి ఆస్తులు పెంచి
అధికారం పట్టి శిష్ట రక్షణ , దుష్ట శిక్షణ అన్నావు
అందరం ఒకటే అంటూనే
తెరిచావు నీ డేగ కన్ను
మానెయ్ నీ నమస్కారం.
నీవు సదా అమ్ముతూ ఉంటే
నేను సదా కొంటూ
వస్తుజాలాన్ని వాడి పారేస్తుంటే
భావజాల ఉచ్చుబిగించి
వాదించావు నీకు చావు లేదని
సాగించావు మృత్యువ్యాపారం
తీసేయి నీ ఆషాఢభూతి వేషం
నీవంటె నాకు ఎనలేని ద్వేషం
నీవు త్యజించవు కొనుక్కున్న అధికారం
నే వదలను కనుక్కున్న ధిక్కారం
నీవు చూపించు అగ్రరాజ్య అహంకారం
నేను ఆపను సమతా సమరం
నీవు కూలినా , నేను రాలినా
ప్రకృతి గెలుస్తుంది నీ వికృత వ్యవస్థపై
సత్యం నిలుస్తుంది
సామ్రాజ్యవాద సమాధిపై.
నీ కన్నుల్లో ఆమె నవ్వు
ఎప్పుడయింది ఆమె నీకు అరి
ఏ దవానలం, తుఫాను, మహమ్మారి
వేసింది మీ బంధానికి ఉరి!
నాడు కలిసి వేటాడావు
పశువులు మేపావు
వ్యవసాయం చేశావు
ఎప్పుడయింది ఆ సబల అబల?
ప్రాచీన యుగంలో సిలువవేసి
మధ్య యుగంలో అణిచివేసి
నవీన యుగంలో వేతన బానిసను చేసిన నీతో
వద్దు కరచాలనం.
పన్నులు లాగి ఆస్తులు పెంచి
అధికారం పట్టి శిష్ట రక్షణ , దుష్ట శిక్షణ అన్నావు
అందరం ఒకటే అంటూనే
తెరిచావు నీ డేగ కన్ను
మానెయ్ నీ నమస్కారం.
నీవు సదా అమ్ముతూ ఉంటే
నేను సదా కొంటూ
వస్తుజాలాన్ని వాడి పారేస్తుంటే
భావజాల ఉచ్చుబిగించి
వాదించావు నీకు చావు లేదని
సాగించావు మృత్యువ్యాపారం
తీసేయి నీ ఆషాఢభూతి వేషం
నీవంటె నాకు ఎనలేని ద్వేషం
నీవు త్యజించవు కొనుక్కున్న అధికారం
నే వదలను కనుక్కున్న ధిక్కారం
నీవు చూపించు అగ్రరాజ్య అహంకారం
నేను ఆపను సమతా సమరం
నీవు కూలినా , నేను రాలినా
ప్రకృతి గెలుస్తుంది నీ వికృత వ్యవస్థపై
సత్యం నిలుస్తుంది
సామ్రాజ్యవాద సమాధిపై.
నీ జీవన విధానం
మాకు సరిపడదంటే
నీ విలువలు వలువలు లేని
క్రూర అధికారం అంటె
నాడు రష్యా
నిన్న చైనా , క్యూబా , వియత్నాంల పై కత్తి గట్టి
మధ్య ప్రాచ్యం , ఆఫ్రికా, లాటిన్ అమెరికా లలో
నియంతల కొమ్ము గాచి
దేశాలెన్నిటినో స్మశానాలుగా మార్చి
ఇప్పుడెందుకు బాధ అంకుల్!
నీదాకా వస్తే కాని
నీ ప్రాణం తీపి అని తెలియలేదు కదూ!
నీ ప్రచార పటాటొపంలో
నేటి దాకా
మునిగిన జనం
ఇప్పుడు చూస్తున్నారు
నీ నగ్న స్వరూపం
నీ బెదిరింపుల పర్వం .
ఆధారాలు లేకున్నా
నీ కయ్యాల రాజకీయం
అందరికీ సుపరిచితం
తప్పు చేసినపుడు
వూహాన్ కాని, వాషింగ్టన్ కాని
చెల్లించక తప్పదు మూల్యం
ముందో, వెనకో.
నీ జనం మీద నాకు జాలి
కసాయిని నమ్మారని
ఇప్పటికైనా తెలుసుకొ
అంకుల్ శామ్!
నీవు కాగితం పులివని
నీటిలో కరిగే ఉప్పు బొమ్మవని
అణు బాంబులు, అఖండ సంపదలు
నీకు సదా అండగా ఉండవని
మార్పు కాలచక్రం తీర్పు అని.
మాకు సరిపడదంటే
నీ విలువలు వలువలు లేని
క్రూర అధికారం అంటె
నాడు రష్యా
నిన్న చైనా , క్యూబా , వియత్నాంల పై కత్తి గట్టి
మధ్య ప్రాచ్యం , ఆఫ్రికా, లాటిన్ అమెరికా లలో
నియంతల కొమ్ము గాచి
దేశాలెన్నిటినో స్మశానాలుగా మార్చి
ఇప్పుడెందుకు బాధ అంకుల్!
నీదాకా వస్తే కాని
నీ ప్రాణం తీపి అని తెలియలేదు కదూ!
నీ ప్రచార పటాటొపంలో
నేటి దాకా
మునిగిన జనం
ఇప్పుడు చూస్తున్నారు
నీ నగ్న స్వరూపం
నీ బెదిరింపుల పర్వం .
ఆధారాలు లేకున్నా
నీ కయ్యాల రాజకీయం
అందరికీ సుపరిచితం
తప్పు చేసినపుడు
వూహాన్ కాని, వాషింగ్టన్ కాని
చెల్లించక తప్పదు మూల్యం
ముందో, వెనకో.
నీ జనం మీద నాకు జాలి
కసాయిని నమ్మారని
ఇప్పటికైనా తెలుసుకొ
అంకుల్ శామ్!
నీవు కాగితం పులివని
నీటిలో కరిగే ఉప్పు బొమ్మవని
అణు బాంబులు, అఖండ సంపదలు
నీకు సదా అండగా ఉండవని
మార్పు కాలచక్రం తీర్పు అని.
Friday, April 24, 2020
Carona poem 1
ప్రేమిస్తా0 జీవితమంటే
కాని లేత మొక్కల్ని నరికేసి
నిర్మల కాసారాల్ని మురికి చేస్తాం.
భయపడతాం చావంటే
కాని గాలిని ఖరీదుచేస్తాం
యుధ్ధాలకు జై కొడతాం
ప్రేమిస్తాం మన అభి'మతాన్ని'
కాని కలహాల్ని రగిలిస్తామ్
యువ ప్రేమను పొడిచేస్తా మ్
భయపడతా0 చావంటే
కాని మూగ జీవులను నిర్మూలిస్తామ్
నోరున్న వీరులను ఖైదు చేస్తామ్
ప్రేమిస్తాం పెళ్లాం, పిల్లల్ని
కాని భరిస్తామ్ నారి,బాల్యం పై హత్యాచారాల్ని
మురికి వాడల్ని మాయం చేస్తూ గోడలు కడతాం
బ్రతుకు భారమైన వలస కూలీల నెత్తిపై కత్తి పెడతాం
నయా వలసవాదానికి సలాం చేస్తాం
నిజానికి మనం ద్వేషిస్తా0 జీవితమంటే
ప్రేమిస్తాం చావు భయాన్ని.
Subscribe to:
Posts (Atom)