Friday, April 24, 2020

Carona poem 1


ప్రేమిస్తా0 జీవితమంటే
కాని లేత మొక్కల్ని నరికేసి
నిర్మల కాసారాల్ని మురికి చేస్తాం.
భయపడతాం చావంటే
కాని గాలిని ఖరీదుచేస్తాం
యుధ్ధాలకు జై కొడతాం

ప్రేమిస్తాం మన  అభి'మతాన్ని'
కాని కలహాల్ని రగిలిస్తామ్
యువ ప్రేమను పొడిచేస్తా మ్
భయపడతా0 చావంటే
కాని మూగ జీవులను నిర్మూలిస్తామ్
నోరున్న వీరులను ఖైదు చేస్తామ్

ప్రేమిస్తాం పెళ్లాం, పిల్లల్ని
కాని భరిస్తామ్ నారి,బాల్యం పై హత్యాచారాల్ని

మురికి వాడల్ని మాయం చేస్తూ గోడలు కడతాం
బ్రతుకు భారమైన వలస కూలీల  నెత్తిపై కత్తి పెడతాం
నయా వలసవాదానికి సలాం చేస్తాం

నిజానికి మనం ద్వేషిస్తా0 జీవితమంటే
ప్రేమిస్తాం చావు భయాన్ని.

No comments:

Post a Comment